గోదావరిఖని, వెలుగు: సింగరేణి రామగుండం రీజియన్పరిధిలోని ఆర్జీ–1 ఏరియా ఓపెన్‌కాస్ట్ 5 ప్రాజెక్ట్‌లో మంగళవారం సాయంత్రం ‘సింధు’ షవల్కాలిపోయింది. ఓపెన్కాస్ట్సర్ఫేస్లోని డంప్‌యార్డు నుంచి బొగ్గును షవల్ద్వారా డంపర్వెహికల్స్లో నింపి సీహెచ్‌పీకి తరలిస్తుంటారు. బొగ్గును డంపర్‌లో నింపుతుండగా ఒక్కసారిగా షవల్నుంచి మంటలు వ్యాపించాయి. డంపర్ఆపరేటర్అరవడంతో షవల్మెషీన్ ఆపరేటర్ పి.శ్రీను కిందకు దూకాడు. దీంతో ప్రాణాపాయం తప్పింది.
షవల్విలువ రూ.కోటికి పైగానే ఉండగా.. దాదాపు70 శాతం కాలినట్టు ఆఫీసర్లు గుర్తించారు. ఘటన ఎలా జరిగిందనే విషయమై ప్రాజెక్ట్ఆఫీసర్లు ఆరా తీస్తున్నారు. కాలం చెల్లిన మెషీన్లను నడిపించడం, షవల్మెషీన్ లో ఆయిల్లీకేజీ కావడం, దానిపై బొగ్గు చూరపడి అది వేడికి మండి మంటలు వ్యాప్తి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు.