హైదరాబాద్, వెలుగు: ఇండియా ఆటోమోటివ్ సెక్టార్‌లోని ఇన్నోవేషన్స్‌ను ప్రోత్సహించేందుకు స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ–హబ్, జపనీస్ ఆటోమోటివ్ సప్లయర్ డెన్సో చేతులు కలిపాయి. ఇందుకు సంబంధించి తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు, డెన్సో ఇండియా సీఈఓ యసుహిరో లిడా ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం, డెన్సో మధ్య ఎంఓయూ కుదిరింది. టీ–హబ్‌కు చెందిన టీ–కనెక్ట్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఇండియాలోని ఆటోమోటివ్ స్టార్టప్‌లతో డెన్సో పనిచేస్తుంది. కొత్త ఐడియాలను క్రియేట్ చేయడం, క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడం, టెక్నాలజీలను డెవలప్ చేయడంలో ఈ కంపెనీ సాయం చేస్తుంది.