![పిట్టీ చేతికి బగాడియా చైత్ర ఇండస్ట్రీస్](https://static.v6velugu.com/uploads/2024/03/an-agreement-with-bcipl-shareholders-hyderabad-company-pitti-engineering-ltd_GYuPfkzDRb.jpg)
హైదరాబాద్, వెలుగు : బగాడియా చైత్ర ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీఐపీఎల్)లో100 శాతం ఈక్విటీ షేర్ క్యాపిటల్‌ను కొనుగోలు చేయడానికి బీసీఐపీఎల్, దాని వాటాదారులతో ఒక ఒప్పందంపై సంతకం చేసినట్లు హైదరాబాద్ కంపెనీ పిట్టీ ఇంజనీరింగ్ లిమిటెడ్ తెలిపింది.
రూ. 124.92 కోట్ల ఎంటర్‌ప్రైజ్ వాల్యుయేషన్‌తో డీల్ జరిగింది. బీసీఐపీఎల్ తన ప్రస్తుత రుణాన్ని తిరిగి చెల్లించడానికి కొత్త మూలధనంగా రూ. 40 కోట్ల వరకు ఇవ్వనున్నట్టు పిట్టీ ఇంజనీరింగ్ తెలిపింది. సంబంధిత నియంత్రణ, చట్టబద్ధమైన సంస్థల ఆమోదం తరువాత విలీనం పూర్తవుతుంది.