ఖమ్మం: జిల్లాలోని కల్లూరు మండలం చెన్నూరు గ్రామంలో ఎయిర్ గన్ కలకలం రేపింది. ఓ గొర్రెల కాపరి ఎయిర్ గన్ పట్టుకుని గ్రామంలో తిరుగుతున్నాడని సమాచారం అందడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే వాళ్ల విచారణలో అది డమ్మీ గన్ అని తేలింది. ఇక వివరాల్లోకి వెళ్తే... గ్రామానికి చెందిన వల్లభనేని హరీశ్ అనే గొర్రెల కాపరికి 70 వరకు గొర్రెలు ఉన్నాయి. అయితే గ్రామంలోని కుక్కలు నిత్యం తన గొర్రెల వెంటబడి కరవడానికి ప్రయత్నించేవి. దీంతో ఆ కుక్కల నుంచి గొర్రెలను కాపాడుకోవడానికి హరీశ్ చాలా శ్రమ పడాల్సి వచ్చేది. ఈ క్రమంలోనే కుక్కల బారినుంచి గొర్రెలను కాపాడుకోవడానికి ఎయిర్ గన్ కొనాలని నిశ్చయించుకున్నాడు. అందుకోసం ఖమ్మం పట్టణంలోని అబ్బాస్ టాయ్స్ సెంటర్ లో కోబ్రా 65 మోడల్ ఎయిర్ గన్ కొనుగోలు చేశాడు. అనంతరం గన్ లో గుండ్రటి రాయిని బుల్లెట్ లా పెట్టి కుక్కల వైపు గురి పెడుతూ బెదిరించేవాడు.
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరు గ్రామం లో ఎయిర్ గన్ కలకలం రేపింది.ఒక యువకుడు తుపాకీ పట్టుకుని గ్రామంలో తిరుగుతున్నాడని ప్రచారం జోరుగా సాగడం తో పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చెన్నూరు గ్రామానికి చెందిన వల్లభ నేని హరీష్ అనే యువకుడు తనకు ఉన్న 70 శాల్తీల గొర్రెలను కుక్కల భారీ నుండి కాపాడుకునేందుకు ఖమ్మం కేంద్రం లోని అబ్బాస్ టాయ్స్ సెంటర్ లో కోబ్రా 65 మోడల్ ఎయిర్ గన్ కొనుగోలు చేశాడు.ఈ క్రమం లో తాను కొనుకున్న ఎయిర్ గన్ లో ఒక చిన్న గుండ్రటి రాయి ను బుల్లెట్ లా పెట్టి కుక్కకు దగ్గరగా పేల్చాడు. దీంతో ఓ కుక్క చనిపోయింది. ఇక అప్పటి నుంచి గన్ ను భుజాన తగిలించుకొని హరీశ్ గ్రామంలో తిరిగేవాడు. దీంతో అతడి వద్ద ఉన్నది నిజం తుపాకీ అనుకొని చాలా మంది భయంతో అతడి దగ్గరికి వచ్చేవారు కాదు. అయితే గ్రామంలోని టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ముఖ్య నాయకుడిని హత్య చేసేందుకే హరీశ్ తుపాకి కొన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పూర్తి విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హత్యకు కుట్ర అంటూ వైరల్ గా మారిన పోస్టులు ఫేక్ అని పోలీసులు తేల్చారు. గొర్రెల ను కాపాడుకునేందుకే గొర్రెల కాపరి ఎయిర్ గన్ కొనుగోలు చేసినట్లు పోలీస్ లు ప్రాథమికంగా నిర్ధారించారు.