సెలవుపై ఇంటికి వచ్చి..  జ్వరంతో జవాన్ మృతి

సెలవుపై ఇంటికి వచ్చి..  జ్వరంతో జవాన్ మృతి

 

  • భాగ్యనగర్ తండాలో విషాదం

కారేపల్లి, వెలుగు : ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని భాగ్యనగర్ తండాలో సెలవుపై ఇంటికి వచ్చిన ఓ ఆర్మీ జవాన్ జ్వరంతో కన్నుమూశాడు. మృతుడి కుటుంబీకుల కథనం ప్రకారం.. మండలంలోని భాగ్యనగర్ తండాకు చెందిన తేజావత్ బాలాజీ (40) 2007లో ఆర్మీలో చేరాడు. ప్రస్తుతం పంజాబ్ బీఎస్ఎఫ్​లో పనిచేస్తున్నాడు. లూథియానా 9వ బెటాలియన్​కు బదిలీ చేయడంతో సెలవులు ఇవ్వగా ఈ మధ్యే ఇంటికి వచ్చాడు. వారం క్రితం తీవ్ర జ్వరం రాగా కుటుంబసభ్యులు ఖమ్మం దవాఖానకు తరలించారు.

ఫిట్స్​ రావడంతో హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ గుండెపోటుతో శుక్రవారం చనిపోయాడు. బాలాజీకి భార్య రాజేశ్వరి, కొడుకు రోహిత్ సింగ్, బిడ్డ చాందిని ఉన్నారు. భౌతికకాయాన్ని స్వగ్రామమైన భాగ్యనగర్ తండాకు తరలించారు. సైనిక లాంఛనాలతో శనివారం అంత్యక్రియలు నిర్వహిస్తారని కుటుంబసభ్యులు తెలిపారు.