హైదరాబాద్: బేగం బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోప్ ఖానలో జరిగిన ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత ఐదేళ్లుగా భార్య భర్తలు గొడవలు పడుతున్నారు. ఇద్దరి మధ్య గొడవ పెద్దది అవగా భార్య సంతోషి ఆమె అన్నదమ్ములకు ఫోన్ చేసి చెప్పింది. కోపంతో సంతోషి అన్నదమ్ములు మే 10న బేగం బజార్ తోప్ ఖాన లోని బావ ఇంటిపై దాడి చేశారు. కత్తులు, కర్రలతో బావ రామేశ్వర్, ఆయన తల్లి గంగా భాయి పై దాడి చేశారు. గంగా భాయి, ఆమె కొడుకు రామేశ్వర్ కు తీవ్రగాయాలైయ్యాయి. హాస్పిటల్ లో చిక్సిత్ పొందుతున్నారు. రామేశ్వర్ భార్యతోపాటు ఆమె నలుగురు అన్నదమ్ములపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. సంతోషి అన్నదమ్ములు కత్తులు, కర్రలతో గుంపుగా ఇంటిపైకి వచ్చి దాడి చేసిన విజువల్స్ సీసీటీవీలో రికార్డ్ అయింది.