హైదరాబాద్‌లోని బౌరంపేటలో దారుణం చోటుచేసుకుంది. బౌరంపేట బస్తీలో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు. విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీఆర్ఎస్ కౌన్సిలర్ విష్ణు వర్ధన్ రెడ్డి దగ్గర కారు డ్రైవర్ గా పనిచేసే యోగి చిన్నారి తల్లితో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడు. సదరు మహిళతో ఏకాతంగా కలిసిన వీడియోలు తీసి.. వాటిని అడ్డంపెట్టుకొని చిన్నారి (బాధితురాలి) తల్లిని గత కొంతకాలంగా యోగి బెదిరిస్తున్నాడు.
Also Read :- హైదరాబాద్‌లో కుంగిపోయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రోడ్
ఎవరు లేని సమయంలో 4ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. చిన్నారి అపస్మాకర స్థితిలోకి వెళ్లడంతో తల్లిదండ్రులు హైదర్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. హాస్పిటల్ లో డాక్టర్లు చిన్నారిపై అఘాయిత్యం జరిగిందని పోలీసులకి చెప్పారు. విషయం బయటకు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడు యోగిని పోక్సో చట్టం కింద అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు.