కరీంనగర్: హుజూరాబాద్ ఏరియా హాస్పిటల్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని ప్రసూతి విభాగంలోని స్త్రీల మరుగుదొడ్డిలో పిండం కనిపించింది. పిండం చనిపోయింది. హాస్పిటల్ కు వచ్చిన పేషెంట్లో ఒకరు అది గుర్తించి డాక్టర్లకు ఫిర్యాదు చేశారు. ఎవరైనా మహిళ బాత్ రూమ్ కి వెళ్ళిన సమయంలో అబార్షన్ అయి ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ALSO READ | పాపం ఏ కష్టమొచ్చిందో.. ఈ హోంగార్డ్ జీవితం ఇలా ముగిసిపోయింది