- మైనర్‌పై గ్యాంగ్ రేప్
- రంగారెడ్డి జిల్లాలో ఘటన
- ఆలస్యంగా వెలుగులోకి
- బాధితురాలిది, నిందితులది బీహార్
ఇబ్రహీంపట్నం, వెలుగు : రంగారెడ్డి జిల్లాలో దారు ణం జరిగింది. మైనర్‌పై నలుగురు యువకులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీహార్‌కు చెందిన ధర్మేందర్, అదే రాష్ట్రానికి చెందిన ఓ బాలిక (17) ప్రేమించుకున్నారు. ధర్మేందర్ పని కోసమని నగరానికి వచ్చాడు. బీహార్‌కు చెందిన ఇద్దరు మిత్రులతో కలిసి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు సమీపంలో అద్దెకు ఉంటున్నాడు. స్థానికంగా మేస్త్రీ పనులకు వెళ్తున్నాడు. అయితే వారం కింద బాలికను ధర్మేందర్ ఇక్కడికి పిలిపించుకున్నాడు.
తాను అద్దెకు ఉంటున్న దగ్గర రెండు రూమ్‌లు ఉండగా.. ఒక రూమ్‌లో ధర్మేందర్, బాలిక ఉంటుండగా, మరో రూమ్‌లో అతని స్నేహితులు ఉంటున్నారు. ఈ క్రమంలో వాళ్లకు బాలికనే వంట చేసి పెట్టింది. ఈ నెల 5న రాత్రి ధర్మేందర్, అతని స్నేహితులు, వేరేచోట ఉండే బీహార్‌కే చెందిన మరో ఇద్దరు కలిసి పార్టీ చేసుకున్నారు. అర్ధరాత్రి దాటాక ధర్మేందర్ ను బయటకు నెట్టిన స్నేహితులు.. అతని లవర్ పై అత్యాచారానికి పాల్పడ్డారు. ధర్మేందర్ డయల్ 100కు ఫోన్ చేయగా, ఇబ్రహీంపట్నం పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి చందన్ కుమార్(24), చందన్ కుమార్(20), మల్లు, శంభును అరెస్టు చేశారు. పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. బాలికను నగరంలోని సఖీ కేంద్రానికి తలించినట్టు పోలీసులు తెలిపారు.