మహిళ గొంతు కోసి పరార్.. వికారాబాద్​ జిల్లా మన్నెగూడలో ఘటన

మహిళ గొంతు కోసి పరార్.. వికారాబాద్​ జిల్లా మన్నెగూడలో ఘటన

పరిగి, వెలుగు: సిటీలోని బండ్లగూడకు చెందిన ఓ మహిళపై వికారాబాద్ ​జిల్లా మన్నెగూడలో హత్యాయత్నం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు మహిళ గొంతు కోసి పరారయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో మన్నెగూడ సమీపంలో బండ్లగూడకు చెందిన బీబీ ఫాతిమాపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. గొంతు కోసం పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన ఫాతిమా నడుచుకొంటూ మన్నెగూడ చౌరాస్తాలోని ఓ టీ స్టాల్ వద్ద పడిపోయింది.

టీ స్టాల్ ​నిర్వాహకుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అక్కడి చేరుకుని బాధితురాలిని 108లో వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఫాతిమా మాట్లాడలేని స్థితిలో ఉంది. అయితే ఆమె మన్నెగూడ ఎందుకు వచ్చింది? ఆమెపై దాడిచేసింది ఎవరు? ఎందుకు చేశారు?  అనే వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసేకుని దర్యాప్తు చేస్తున్నామని పరిగి సీఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దాడిచేసిన వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.