అసెంబ్లీ ముందు ఆటోడ్రైవర్ ఆత్మహత్యాయత్నం

అసెంబ్లీ ముందు ఆటోడ్రైవర్ ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్: అసెంబ్లీ ముందు ఓ ఆటో డ్రైవర్  కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. అయితే సమావేశాలు ప్రారంభం అయిన కొద్దిసేపటికే ఓ వ్యక్తి అసెంబ్లీ ఎంట్రన్స్ గేట్ ముందుకు ఆటోలో వచ్చాడు. అక్కడ ఒంటిపై కిరోసిన్ పోసుకొని.. హోంమంత్రి మహమూద్ అలీ డౌన్ డౌన్, కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. గమనించిన పోలీసులు 
అడ్డుకొని అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి వచ్చిన ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు గల కారణాలు తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

For More News..

రాబోయే మూడు గంటల్లో భారీ వర్షాలు