కూసుమంచి, వెలుగు : ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్‌లో రెండేండ్ల కూతురితో సహా దూకి ఆత్మహత్యాయత్నం చేయబోయిన ఒకరిని బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ కాపాడాడు. జీళ్లచెరువుకు చెందిన జంపాల నరేశ్ ఆటోడ్రైవర్. శనివారం తన భార్యతో గొడవపడ్డాడు. మనస్తాపానికి గురైన అతడు అదే రోజు రాత్రి తన రెండేండ్ల కూతురుని తీసుకుని పాలేరు రిజర్వాయర్‌లో దూకేందుకు వెళ్లాడు.
ఈ విషయాన్ని డయల్100కు ఫోన్ చేసి చెప్పి తన కుటుంబసభ్యులకు చెప్పాలని కోరాడు. దీంతో వెంటనే స్పందించిన బ్లూ కోల్ట్స్ కానిస్టేబుల్ బ్రహ్మం అక్కడికి చేరుకున్నాడు. అప్పటికే షర్టును చింపుకుని, ఒంటికి రాళ్లు కట్టుకుని రిజర్వాయర్‌లో దూకేందుకు ప్రయత్నిస్తున్న నరేశ్‌ను పట్టుకుని వెనక్కి లాగాడు. తర్వాత పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.