- ఆసిఫ్ నగర్ పీఎస్ పరిధిలో ఘటన
మెహిదీపట్నం, వెలుగు : పాత కక్షలతో ఓ వ్యక్తిపై కొందరు హత్యకు యత్నించిన ఘటన ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితుడి కుటుంబసభ్యులు, ఎస్ఐ జావెద్ తెలిపిన ప్రకారం.. ఆసిఫ్‌నగర్ లోని జేబాబాగ్‌లో ముక్రంజా మసీద్వద్ద నివసించే మహమ్మద్ రఫిక్ (46) ఆటో డ్రైవర్. మంగళవారం సాయంత్రం రఫిక్ వద్దకు వచ్చి ఆరుగురు వ్యక్తులు కట్టెతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన రఫిక్ ను వెంటనే బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.
ప్రస్తుతం అతని కండీషన్ సీరియస్ గా ఉందని డాక్టర్లు తెలిపినట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. అయితే.. కొన్నేళ్లుగా వరుసకు సోదరులైన షౌకత్, అజీజ్, వసీమ్, రియాజ్, రెహ్మన్, షానుతో రఫిక్‌కు విబేధాలు ఉండేవని చెప్పారు.