ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భూకంపం సంభవించింది. పితోర్‌గఢ్ జిల్లాలోని మున్సియరి, నాచ్నితో సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 3.8 తీవ్రతగా నమోదు అయ్యాయి. పితోరాగర్‌కు ఉత్తర-వాయువ్య దిశలో 23 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. ఈ భూకంపం ఉదయం 8:58 గంటలకు వచ్చినట్లు అధికారులు తెలిపారు.