యూపీలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 3.9 తీవ్రత

యూపీలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 3.9 తీవ్రత

న్యూఢిల్లీ:  ఉత్తరప్రదేశ్‌లో భూకంపం సంభవించింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. యూపీలోని సోన్‌భద్రలో జూన్ 2వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3.49 గంటల సమయంలో రిక్టర్ స్కేల్‌పై 3.9 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) వెల్లడించింది.

ఖనిజ సంపద, థర్మల్ పవర్ ప్లాంట్‌లకు ప్రసిద్ధి చెందిన సోన్‌భద్ర జిల్లాలో భూకంప కేంద్రం ఏర్పడినట్లు తెలిపింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. అయితే,  ఈ ఘటనలో ప్రాణ, ఆస్థి నష్టం గురించి ఇంకా వివరాలు తెలియరాలేదని అధికారులు చెప్పారు.  ఈ  భూకంప ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.