మయన్మార్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.2 తీవ్రత

మయన్మార్‌లో భారీ భూకంపం సంభవించింది. ఏప్రిల్ 29వ తేదీ సోమవారం తెల్లవారుజామున భూప్రకంపనలు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ప్రకటించింది. రిక్టర్ స్కేల్‌పై 4.2 తీవ్రతతో భూకంపం మయన్మార్‌ను కుదిపేసిందని వెల్లడించింది.

 అక్షాంశం 25.39,  రేఖాంశం 96.06  దగ్గర 7 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఏర్పడిందని తెలిపింది.  భూకంపం ధాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని చెప్పింది.