కేసీఆర్​ దిష్టిబొమ్మ దహనం : పండ్ల రాజు

కామారెడ్డిటౌన్, వెలుగు:  జిల్లా కేంద్రంలో కాంగ్రెస్​ ఆధ్వర్యంలో  సీఎం కేసీఆర్​ దిష్టిబొమ్మను దహనం  చేశారు.  రైతుబంధు విషయంలో కాంగ్రెస్​ నేతల మాటల్ని వక్రీకరించి  బీఆర్ఎస్​ నేతలు  రేవంత్​రెడ్డి  దిష్టిబొమ్మను దహనం చేయడంపై లీడర్లు  నిరసన వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్​ రైతుల పక్షపాత పార్టీ అన్నారు. కార్యక్రమంలో  టౌన్​ ప్రెసిడెంట్​పండ్ల రాజు, మహిళ కాంగ్రెస్​ ప్రెసిడెంట్ పాక జ్నానేశ్వరి, లీడర్లు  కారంగుల ఆశోక్​రెడ్డి, పాత శివకృష్ణమూర్తి, గుడుగుల శ్రీనివాస్​,  తదితరులు పాల్గొన్నారు.