స్విగ్గీ డెలివరీ బాయ్స్.. జర చూస్కోండన్నా.. పాపం ఈ పెద్దావిడ..!

స్విగ్గీ డెలివరీ బాయ్స్.. జర చూస్కోండన్నా.. పాపం ఈ పెద్దావిడ..!

బెంగళూరు: స్విగ్గీ డెలివరీ బాయ్ బైక్పై వెళుతూ ఒక 60 ఏళ్ల వృద్ధురాలిని ఓవర్ స్పీడ్తో ఢీ కొట్టిన ఘటన బెంగళూరులో వెలుగుచూసింది. అదృష్టవశాత్తూ ఆ పెద్దావిడకు ఫ్రాక్చర్స్ ఏం కాలేదు. కాలికి స్వల్ప గాయం కావడంతో వైద్యులు కట్టు కట్టి పంపించేశారు. అసలేం జరిగిందో.. ఆ పెద్దావిడను ఆసుపత్రిలో చేర్పించిన శివసుబ్రమణ్యం జయరామన్ అనే వ్యక్తి తన ‘ఎక్స్’ ఖాతాలో చెప్పుకొచ్చాడు. తాను ఇంట్లో ఉండగా సాయంత్రం సమయంలో ఒక పెద్దావిడ బాధతో గట్టిగా అరిచిన అరుపులు వినిపించాయని, ఏమైందా అని కిందికొచ్చి చూస్తే రోడ్డుపై ఒక పెద్దావిడ పడిపోయి ఉందని చెప్పాడు.

స్విగ్గీ డెలివరీ బాయ్ ఢీ కొట్టి కనిపించాడని తెలిపాడు. ఆమె వయసు 60కి పైగానే ఉంటుందని.. వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లానని వివరించాడు. అదృష్టవశాత్తూ ఎలాంటి ఫ్రాక్చర్స్ కాలేదని.. డెలివరీ బాయ్స్ బైక్స్ ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, డెలివరీ బాయ్స్ బైక్స్ స్పీడ్ ను 50 kmphకి పరిమితం చేసేలా రూల్ తీసుకురావాలని స్విగ్గీని, జొమాటోను, మంత్రి డీకే శివకుమార్ను ట్యాగ్ చేశాడు. ఈ ఘటనపై స్విగ్గీ స్పందించింది. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని, ఆరా తీసి తగిన చర్యలు తీసుకుంటామని స్విగ్గీ తెలిపింది.

వాస్తవానికి ఇలాంటి రోడ్డు ప్రమాదాల్లో కేవలం డెలివరీ బాయ్స్ తప్పు మాత్రమే లేదు. ఈ టైం లోపు డెలివరీ ఇవ్వాల్సిందేనని టార్గెట్ పెడుతున్న ఫుడ్ డెలివరీ కంపెనీలదీ కూడా తప్పే. మెట్రో నగరాల్లో ఫుడ్ డెలివరీ బాయ్స్ కస్టమర్కు చెప్పిన టైంకు ఫుడ్ డెలివరీ చేయడానికి స్కూటీలు, బైక్స్పై దూసుకెళుతుంటారు. ఫుడ్ డెలివరీ ఆలస్యం అయితే కస్టమర్ల ఆగ్రహానికి గురి కాక తప్పదు. దీనికి తోడు ఈ ఫుడ్ డెలివరీ సంస్థలు ఇన్ని నిమిషాల్లో ఫుడ్ డెలివరీ చేస్తామని, అలా చేయలేకపోతే ఫుడ్ ఫ్రీ అని కస్టమర్లకు బంఫర్ ఆఫర్లు ఇస్తుంటారు.

ALSO READ | మిస్టరీ ఏంటీ : రైలు పట్టాలపై శవంగా.. ఇంటెలిజెన్స్ బ్యూరో మహిళా అధికారి..!

చెప్పిన టైం లోపు డెలివరీ చేయకపోతే కస్టమర్కు ఫుడ్ ఫ్రీగానే అందుతుంది కానీ డెలివరీ బాయ్ పై మాత్రం చర్యలు తీసుకుని.. కొన్ని సందర్భాల్లో ఉద్యోగాల నుంచి కూడా ఫుడ్ డెలివరీ బాయ్స్ ను తీసేస్తున్న పరిస్థితి ఉంది. అందువల్ల.. చెప్పిన టైం లోపు వెళ్లేందుకు డెలివరీ బాయ్స్ ఓవర్ స్పీడ్ గా వెళుతూ ప్రమాదాలకు కారణమవుతూ, కొన్ని సందర్భాల్లో ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు.