మహరాష్ట్రలో గిలియన్ బార్ సిండ్రోమ్ తో మరొకరు మృతిచెందారు. ఆదివారం ( ఫిబ్రవరి 2) నాందేడ్ లో జీబీఎస్ తో వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో మహారాష్ట్రలో జీబీఎస్ తో మృతిచెందిన వారి సంఖ్య ఐదుకు చేరింది. ప్రస్తుతం పుణెలో 149 కేసులు అయ్యాయి. మరొవైపు అసోం లో కూడా జీబీఎస్ తో తొలి మరణం నమోదుఅయింది. గౌహతి ఆస్పత్రిలో 17 యేళ్ల బాలిక చికిత్స పొందుతూ మరణించింది.
GBS అనేది నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే వ్యాధి. ఇది కండరాల బలహీనత, పక్షవాతం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. మహారాష్ట్రలోని పుణెలో ఇప్పటివరకు 82 కేసులు నమోదు అయ్యాయి. పుణె మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కొత్త గ్రామాల్లో ఎక్కువగా జీబీఎస్ కేసులు నమోదు అయ్యాయి. అయితే ఈ గ్రామాలకు సప్లయ్ చేసే వాటర్ లో ఏమైనా జీబీఎస్ కారకాలు ఉన్నాయా అనే కోణంలో తనిఖీలు చేపట్టారు మున్సిపల్ అధికారులు.
జీబీఎస్ కేసులున్న ప్రాంతాలకు వాటర్ సరఫరా చేస్తున్న ప్రైవేట్ ట్యాంకర్లనుంచి శాంపిల్స్ సేకరించి టెస్ట్ చేస్తున్నారు. జీబీఎస్ రోగుల మలం నుంచి శాంపిల్స్ లో కనుగొనబడిన క్యాంపిలో బాక్టర్ జెజుని అనే బ్యాక్టీరియా నీటిలో ఉందా లేదా అని పరీక్షలు చేస్తున్నారు. జీబీఎస్ కేసులు, మరణాలను తగ్గించేందుకు చర్యలు చేపట్టింది పుణె మున్సిపల్ కార్పొరేషన్ .