పార్వతీపురం మన్యం జిల్లాలో ఒంటరి ఏనుగు హల్‌చల్ చేసింది.పార్వతీపురం రైల్వేస్టేషన్ తో పాటు పరిసర ప్రాంతాలతో పాటు పలు కాలనీల్లో గజరాజు స్వైరవిహారం చేసింది. ఏనుగు సంచారం నేపథ్యంలో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.దారితప్పి జనారణ్యంలోకి వచ్చిందని తెలుస్తోంది. కాసేపు కాలనీల్లో కలియ తిరిగి.. ఆ తరువాత రైల్వే స్టేషన్ లో ప్రయాణికులను భయ భ్రాంతులకు గురి చేసింది. ఆ తరువాత గ్రామ సమీపంలోని కొండ ప్రాంతానికి ఏనుగు వెళ్లిపోయిందని స్థానికులు చెబుతున్నారు.సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఏనుగును ట్రాక్ చేస్తున్నారు.
పార్వతీపురం రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాం మీదకి వచ్చిన ఏనుగు pic.twitter.com/z8moFODomL
— Telugu Scribe (@TeluguScribe) October 29, 2023