ప్రియురాలితో జల్సాల కోసం.. పని చేస్తున్న సంస్థకే కన్నం వేసిన ఉద్యోగి

ప్రియురాలితో జల్సాల కోసం.. పని చేస్తున్న సంస్థకే కన్నం వేసిన ఉద్యోగి

ప్రియురాలి మోజులో పనిచేస్తున్న సంస్థకే కన్నం వేశాడు సాయిలక్ష్మణ్ అనే వ్యక్తి. బషీర్ బాగ్ చంద్రనగర్ కు చెందిన మర్రి సాయిలక్ష్మణ్.. 8 ఏండ్లుగా హైదరాబాద్ బషీర్ బాగ్ లోని శ్రీ సిద్దివినాయక్ జ్యువెలర్స్ అండ్ ఎక్స్ పోర్ట్స్ కంపెనీలో స్టాక్ ఇంచార్జ్ గా పనిచేస్తున్నాడు. అయితే 2 నెలల నుంచి సాయిలక్ష్మణ్ డ్యూటీకి రాకపోవడంతో యజమానికి అనుమానం వచ్చి ఆడిట్ నిర్వహించారు.

 అందులో 28 తులాల బంగారం మిస్సింగ్ అయినట్లు గుర్తించారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో లక్ష్మణ్ ను విచారించారు సుల్తాన్ బజార్ పోలీసులు. విచారణలో తానే దొంగతనానికి పాల్పడినట్లు వెల్లడించాడు లక్ష్మణ్. దొంగిలించిన బంగారాన్ని విక్రయిస్తూ.. తన లవర్ తో దేవస్థానాలు తిరిగినట్లు చెప్పాడు. నిందితుని నుంచి 3 తులాల బంగారంతో పాటు మణప్పురంలో తాకట్టుపెట్టిన డైమండ్ నెక్లెస్ ను రికవరీ చేసినట్లు తెలిపారు సుల్తాన్ బజార్ ఏసీపీ శంకర్.