జీడిమెట్ల, వెలుగు: జీహెచ్‌ఎంసీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పారిశుద్ధ్య కార్మికురాలిపై కన్నేసిన ఓ ఉద్యోగి, లైంగికంగా వేధిస్తూ వీడియోలు రికార్డ్చేశాడు. తాజాగా వీడియోలు బయటికి రావడంతో ఉన్నతాధికారులు అతనిపై చర్యలు తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జీహెచ్ఎంసీ గాజులరామారం సర్కిల్లో పరిధిలో శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్(ఎస్ఎఫ్ఏ)గా పనిచేస్తున్న కిషన్ ఓ మహిళా శానిటేషన్ వర్కర్‌పై కన్నేశాడు. లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. తాను చెప్పినట్లు వినకపోతే అటెండెన్స్వేయనని, డ్యూటీకి వచ్చినా ఆబ్సెంట్వేస్తానని బెదిరిస్తున్నాడు.
అలా తరచూ ఆమెను లైంగికంగా వేధిస్తూ సెల్ఫోన్లో వీడియోలు రికార్డ్చేశాడు. వాటిని చూపించి బ్లాక్ మెయిల్చేయాలని కిషన్స్కెచ్వేసినట్లు పలువురు శానిటేషన్వర్కర్లు ఆరోపిస్తున్నారు. కాగా ఎస్ఎఫ్ఏ కిషన్ ఇటీవల సెలవుపై వెళ్లాడు. వెళ్తూ.. వీడియోలు రికార్డు చేసిన సెల్‌ఫోన్‌ను సహ ఉద్యోగి ప్రణయ్(ఎస్ఎఫ్ఏ)కి ఇచ్చాడు. వాటిని చూసిన ప్రణయ్ జీహెచ్ఎంసీలో పనిచేసే పలువురు ఉద్యోగులకు పంపాడు. అవి కాస్తా వైరల్అవడంతో కిషన్బాగోతం బయటపడింది. శానిటేషన్వర్కర్ను లైంగికంగా వేధిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న కూకట్పల్లి జోనల్ కమిషనర్ అభిలాష్అభినవ్.. ఎస్ఎఫ్ఏకిషన్తోపాటు, ప్రణయ్‌ను సస్పెండ్‌చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
కమిషనర్ రోనాల్డ్ రోస్ ఆగ్రహం
మహిళా కార్మికురాలిపై వేధింపుల ఘటనపై జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కూకట్ పల్లి జోనల్కమిషనర్ను ఆదేశించారు. కూకట్పల్లి జోనల్కమిషనర్అభిలాష్ అభినవ్, గాజులరామారం డిప్యూటీ కమిషనర్ మల్లారెడ్డి, మెడికల్ ఆఫీసర్లు లు విచారణ జరిపి రోనాల్డ్‌రోస్‌కు నివేదిక అందించారు. లైంగిక వేధింపులు నిజమని తేలడంతో కిషన్‌తోపాటు ప్రణయ్ ను విధుల నుంచి తొలగిస్తూ జోనల్‌కమిషనర్ అదేశాలు జారీ చేశారు.
అయితే కుత్బుల్లాపూర్, గాజులరామారం సర్కిళ్లలో మహిళా పారిశుద్ధ్య కార్మికులపై లైంగిక వేధింపులు కొత్తేమి కాదు. 2019లో ఓ అధికారి ఇలాగే మహిళ కార్మికురాలితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఉన్నతాధికారులు మాత్రం అతన్ని బదిలీ చేసి చేతులు దులుపుకున్నారు. ఉన్నాధికారులు జోక్యం చేసుకుని మహిళా కార్మికులకు రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.