అంతరించిపోతున్న అరుదైన గొల్లభామ

అంతరించిపోతున్న అరుదైన గొల్లభామ

ఒక్కప్పుడు గొల్లభామ రెండువేల నాలుగు వందలకు పైగా రకాలు,నాలుగువందల ముప్పయి జాతులు, పదిహేను కుటుంబాలతో ప్రపంచవ్యాప్తంగా సమశీతోష్ణ, ఉష్ణమండల ప్రాంతాలలో ఉండేవి. ఎక్కువ రకాలు మాంటీడై కుటుంబంలో ఉన్నాయి. గొల్లభామను ఇంగ్లీష్ లో మాంటిస్ అంటారు, ఎందుకంటే ఇవి తన కాళ్ళు ప్రార్థిస్తున్నట్లుగా మడతపెట్టిన భంగిమలో ఉంటుంది, అయితే ఇవి ఇతర జీవులపై దాడి చేసేందుకు సన్నద్ధంగా తన కాళ్లను ఉంచుకుంటుందనే సూచనగా గ్రామీణ శబ్దవ్యుత్పత్తిలో ఉపయోగిస్తారు. వీటి సంతతి రావడం కూడా చాలా విచిత్రం. మగ గొల్లభామతో సంబంధం లేకుండా ఆడ గొల్లభామ గుడ్లను పెడుతుంది. అవి అన్ని ఆడ గొల్లభామలుగానే జన్మిస్తాయి. మగ గొల్లభామ కలిస్తే మాత్రం అన్ని మగవే పుడతాయి. చాలా సందర్భాలలో గొల్లభామ, మిడుతల విషయంలో కొద్దిగా తికమక పడతారు. మిడుత ఎగిరేటప్పుడు తన కాళ్లను అదిమి తన్నటం ద్వారా అత్యంత వేగంగా ఎగురుతుంది. మిడుతలా కాక గొల్లభామ నిదానంగా ఎగురుతుంది. గొల్లభామ ఎటువంటి పరిసరాల్లో జీవిస్తుందో చాలా వరకు ఆ పరిసరాల్లో కలిసిపోయేలా రంగు, ఆకారం ఉంటుంది.

చెట్ల ఆకుల మాదిరిగా, పుల్లల మాదిరిగా అక్కడి పరిసరాలకు తగ్గట్టుగా మారి జీవిస్తాయి. కానీ వాతావరణం కలుషితంగా మారడం వల్ల, శాటిలైట్ తరంగాల రేడియేషన్ పెరగడం వలన, అడవులు అంతరించిపోవడం వలన చాల వరకు కీటకాలు, పక్షులు అంతరించిపోతున్నాయి. అందులో ఒకటి ఈ గొల్లభామ. అడవులకు సరిఅయిన రక్షణ లేకపోవడం వలన అంతరించిపోవడం వలన జంతువులూ జనావాసాల మధ్యలోకి వస్తున్నాయి. వాతావరణం కలుషితానికి కారణాలన్నీ ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకోని తగిన చర్యలు తీసుకున్నప్పుడే అరుదైన వృక్ష సంపద, జంతువులను, పక్షులను, కీటకాలను కాపాడే అవకాశం ఉంటుంది. పరిరక్షించుకోకపోతే భవిష్యత్ తరాలకు గూగుల్ లో వెతికి మాత్రమే చూపించాల్సి వస్తుంది.

- వై. సంజీవ కుమార్,ప్రెసిడెంట్, స్కై ఫౌండేషన్