రంగారెడ్డి జిల్లాలో ఇంజనీరింగ్ విద్యార్థి‎నిపై అత్యాచారం

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఇంజనీరింగ్ విద్యార్థినిపై ఓ ప్రైవేట్ హాస్టల్ యజమాని డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల ప్రకారం.. ఓ విద్యార్థిని (18) మంగళ్‎పల్లి గేటు వద్ద ఉన్న ఓ ప్రైవేట్ హాస్టల్‎లో ఉంటూ ఇబ్రహీం పట్నంలోని సీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఈ విద్యార్థినిపై హాస్టల్ యజమాని డ్రైవర్ కన్నేశాడు. 

ALSO READ | ఒకరితో ప్రేమ.. మరొకరితో అక్రమ సంబంధం.. నార్సింగ్ జంట హత్యల కేసులో బిగ్ అప్‌డేట్

ఈ క్రమంలోనే 2025, జనవరి 16వ తేదీ తెల్లవారుజూమున యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను  పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఈ ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.