ఉపేంద్ర UI నుండి అదిరిపోయే అప్డేట్.. ఫ్యాన్స్ గెట్ రెడీ

విలక్షణ నటుడిగా, దర్శకుడిగా ఉపేంద్ర(Upendra)కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన సినిమాలంటే ఇష్టపడే ఆడియన్స్ కూడా చాలా మందే ఉన్నారు. అయితే కొంత కాలంగా దర్శకత్వానికి దూరంగా ఉంటున్న ఆయన.. మరోసారి వినూత్న కాన్సెప్ట్ తో కొత్త సినిమాను తెరకెక్కిస్తున్నారు. దాదాపు ఏడేళ్ల గ్యాప్‌ తర్వాత ఆయన దర్శకుడిగా తీస్తున్న మూవీ UI. 

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ షెరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన గ్లింప్స్‌ సినిమాపై అంచనాలు పెంచేసింది. తాజాగా ఈ సినిమా నుండి మరో క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్. UI టీజర్‌ డేట్‌ను సోమవారం(సెప్టెంబర్ 11) ప్రకటించబోతున్నట్లు అప్డేట్ ఇచ్చారు. ఇక UI సినిమాను మనోహరన్- శ్రీకాంత్‌ కేపి సంయుక్తంగా నిర్మిస్తుండగా.. రీష్మా నానయ్య హీరోయిన్ గా నటిస్తోంది. కాంతర సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. చాలా గ్యాప్ తరువాత ఉపేంద్ర దర్శకత్వంలో సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి మరి.