
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో పేలుడు సంభవించింది. బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధి గాంధీ నగర్లోని ఓ చెత్తకుండీలో బ్లాస్ట్ జరిగింది. దీంతో చెత్త క్లీన్ చేస్తున్న మహిళ కార్మికురాలికి స్వల్ప గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం మహిళను ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. భారీ శబ్ధంతో పేలుడు సంభవించడంతో స్థానికులు భయాందోళన చెందారు.
ALSO READ | మహా కుంభమేళాలో అగ్నిప్రమాదం: అదే చోట.. అవే టెంట్లు రెండోసారి తగలబడ్డాయి
కాసేపటి దాకా ఏం జరిగిందో అర్థం కాక అయోమయానికి గురయ్యారు. విషయం తెలుసుకుని కాస్త కుదుటపడ్డారు. పేలుడులో గాయపడ్డ కార్మికులు ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బానే ఉందని.. ఆమె ప్రాణానికి ఎలాంటి అపాయం లేదని వైద్యులు వెల్లడించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. చెత్తలో కుండీలో పేలుడికి గల కారణాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.