నల్లగొండ ఫ్రూట్ మార్కెట్​లో పేలుడు.. ఇద్దరు మృతి

నల్లగొండ ఫ్రూట్ మార్కెట్​లో పేలుడు.. ఇద్దరు మృతి

నల్గొండ అర్బన్, వెలుగు : నల్లగొండలోని బర్కత్ పుర కాలనీలో ఉన్న న్యూ స్టార్ ఫ్రూట్స్ కంపెనీ కోల్డ్ స్టోరేజీలో పేలుడు సంభవించి ఇద్దరు చనిపోయారు. ఫ్రూట్స్​మగ్గ బెట్టేందుకు ఏర్పాటు చేసిన రూంలో నైట్రోజన్ ​గ్యాస్​ సిలిండర్ మారుస్తున్న క్రమంలో అది పేలడంతో కంపెనీ ఓనర్ ​షేక్​ ఖలీం(42), ఆటో డ్రైవర్ సాజిద్​ (35) అక్కడికక్కడే చనిపోయారు. పేలుడు ధాటికి వారి శరీర భాగాలు తునాతునకలైపోయాయి.

ALSO READ:ముందుజాగ్రత్త చర్యలు ఏవీ? సీజనల్ వ్యాధులపై  రివ్యూ చేయని ఆరోగ్య శాఖ

ప్రమాదం జరిగినప్పుడు చనిపోయిన వారితో పాటు మరో ఇద్దరు కంపెనీలోనే ఉన్నా దూరంగా ఉండడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ హనుమంతరావు, డీఎస్పీ నరసింహారెడ్డి అక్కడికి వచ్చి ఘటన ఎలా జరిగిందో తెలుసుకున్నారు. చెల్లాచెదురుగా పడిన భాగాలను ఒక చోటికి చేర్చి పోస్టుమార్టానికి తరలించారు. ఘటనపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్​ చేశారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తానని హామీ ఇచ్చారు.