వరంగల్: వినాయక చవితి పండుగ వచ్చిందంటే చాలు... రకరకాల రూపాల్లో బొజ్జ గణపయ్య దర్శనమిస్తుంటాడు. ఈసారి కూడా ట్రెండుకు తగ్గట్టు లంబోదరుడి విగ్రహాలు భక్తులను అలరిస్తున్నాయి. అయితే వరంగల్ నగరంలోని శివనగర్ కు చెందిన బీజేపీ కార్యకర్తలు వినూత్నంగా ఆలోచించారు. గణపతిని ఎత్తుకుని ఉన్న మోడీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడీ విగ్రహం ట్రెండ్ సెట్ చేస్తోంది. బాహుబలి మూవీలో ప్రభాస్ శివలింగాన్ని ఎత్తుకుంటాడు. ఇక్కడ ఏర్పాటు చేసిన మోడీ విగ్రహం కూడా అచ్చం దానిలాగే ఉండటంతో భక్తులు సంబరపడుతున్నారు. ప్రస్తుతం ఈ విగ్రహం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ... తొమ్మిది రోజుల పాటు మోడీ గణపతి కి పూజలు చేస్తామని చెప్పారు. మట్టితో మోడీ విగ్రహాన్ని తయారు చేశామని, మోడీ విగ్రహాన్ని తయారు చేసే అవకాశం రావడం గొప్ప విషయమని తయారీదారుడు రాజేందర్ ఆనందం వ్యక్తం చేశాడు.