అగ్నిప్రమాదాల నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇవాళ కీలక సమావేశం

అగ్నిప్రమాదాల నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇవాళ కీలక సమావేశం

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తరచూ జరుగుతున్న అగ్ని ప్రమాదాల నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ రోజు కీలక సమావేశం జరగనుంది. రాష్ర్ట హోంశాఖ మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ సమావేశంలో GHMC, ఫైర్, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. సికింద్రాబాద్ రాంగోపాల్ పేటలోని దక్కన్ మాల్ లో జరిగిన అగ్నిప్రమాదంతో పాటు ఈ మధ్య జరిగిన ప్రమాదాలపై చర్చించనున్నారు. రెసిడెన్షియల్ ప్రాంతాల్లో కమర్షియల్ బిల్డింగ్స్ ఎన్ని ఉన్నాయో గుర్తించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. రెసిడెన్షియల్ ప్రాంతాల్లో కమర్షియల్ వ్యాపారాలు జరుగుతుంటే సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారనే విషయాలపైనా చర్చించనున్నారు. రూల్స్ కు విరుద్ధంగా నిర్మించిన బిల్డింగ్స్ ను గుర్తించి, వెంటనే వాటిని ఖాళీ చేయించేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలపై జీహెచ్ఎంసీ అధికారులతో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు భారీ నిర్మాణాలపైనా స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు చర్యలు తీసుకోనున్నారని తెలుస్తోంది.