నారాయణ హైస్కూల్​లో ఆకట్టుకున్న అకడమిక్​ ఫెయిర్

నస్పూర్, వెలుగు: విద్యార్థులకు సైన్స్ పట్ల అవగాహన కల్పించాలని మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేశ్ అన్నారు. బుధవారం మంచిర్యాల పట్టణంలోని నారాయణ హైస్కూల్​లో నిర్వహించిన అకడమిక్ ఫెయిర్ లో ఏజీఎం చైతన్యరావుతో కలిసి పాల్గొన్నారు. విద్యార్థి దశ నుంచే సైన్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. చిన్నారులు తయారుచేసిన వివిధ ప్రాజెక్టులు విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మడిశెట్టి కవిత, హై స్కూల్ డీన్ వెంకటస్వామి, ఏఓ సంతోష్, వైస్ ప్రిన్సిపాల్ స్రవంతి, ఈ కిడ్స్ ఆర్ఎన్డీ సంగీత, కో ఆర్డినేటర్ రవళి ప్రియా, కుమార్, ఇమ్రాన్, టీచర్స్, తదితరులు పాల్గొన్నారు.