బొల్లెపెల్లిలో చర్చిని తగల బెట్టిన  గుర్తు తెలియని వ్యక్తులు

గూడూరు, వెలుగు: గుర్తు తెలియని వ్యక్తులు చర్చిని తగలబెట్టిన  ఘటన మహబుబాబాద్ జిల్లా గూడూరు మండలం బొల్లెపెల్లిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బొల్లెపెల్లి శివారులోని రాంలీలా మైదానం సమీపంలో  క్రిష్టియన్లు ప్రార్దన చేయడం కోసం తాత్కాలికంగా ఇల్లు నిర్మించి ప్రార్థనలు చేస్తున్నారు.

సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో ఆ ఇల్లు పూర్తిగా  కాలి పోయింది. మంగళవారం ఉదయాన్నే గమనించిన క్రిష్టియన్లు గూడూరు పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.