కేరళ స్టోరీ తరహా మిస్సింగ్..​ ఆవేదన చెందుతున్న తల్లి

హైదరాబాద్ : నగరంలో కేరళ స్టోరీ తరహా ఘటన వెలుగు చూసింది. భర్త లేకున్నా అల్లారుముద్దుగా పెంచుకున్న తన  కూతురు ఆచూకీ చెప్పాలంటూ తల్లి తల్లడిల్లింది. కుమార్తె తాను మేజర్ నని ఇష్టమొచ్చిన చోట ఉంటానని చెప్పడంతో తల్లి తీవ్ర మనోవేదనకు గురవుతోంది. ఈ ఘటనపై  తల్లి సుమన్ జాదవ్ మీడియాతో మాట్లాడారు. భర్త చనిపోవడంతో చిన్న టిఫిన్ బండి పెట్టుకుని ఇద్దరు కుమారులు, కూతురిని పోషించుకుంటున్నానని తెలిపింది. తన కూతురు సోని జాదవ్ (21) ఎంబీఏ పూర్తి చేసిందని తెలిపింది.

ALSO READ :రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం.. బ్రిజ్‌భూషణ్‌కు కోర్టు సమన్లు

టెన్త్ క్లాస్ వరకు కార్వాన్లో ఓ ప్రైవేటు పాఠశాలలో చదివే సమయంలో అమ్రన్ బేగం అనే మరో యువతితో పరిచయం ఏర్పడిందని తెలిపింది. గత నెల 7న అమ్రన్ తన కూతురు సోనీని  టూవీలర్ పై తీసుకెళ్లిందన్నారు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో పోలీసులకు  కంప్లైంట్ ఇచ్చానన్నారు. అప్పటి వరకు తన కూతురు జాడ తెలియదని చెప్పిన అమ్రన్ బేగం తన కూతురు సోనిని, న్యాయవాదులను పీఎస్ కు  తీసుకుని వచ్చిందన్నారు. కూతురికి ఎంత సర్ది చెప్పినా వినకుండా మళ్లీ కనిపించకుండా పోయిందన్నారు. తన కూతురికి రెండు నెలల ముందే పాస్ పోర్ట్ తీయించినట్లు తెలిసిందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే చొరవ చూపి తన కూతురుని వెతికి తమకు అప్పగించాలని కోరింది.