జాతీయ జెండాకు అవమానం

మేళ్లచెరువు(చింతలపాలెం), హుజూర్​నగర్, వెలుగు : దశాబ్ది ఉత్సవాల వేళ జాతీయ పతాకం అవమానానికి గురైంది. ఓ పార్టీ జెండా పక్కనే అంతకన్న తక్కువ ఎత్తులో ఉంచి జాతీయ జెండాను ఎగురవేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆదివారం చింతల మండల కేంద్రంలో బీఆర్ ఎస్ జెండా పక్కనే తక్కువ ఎత్తులోనే జాతీయ జెండాను ఆవిష్కరించారు.

మరోవైపు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం లింగగిరి పీహెచ్​సీలో జాతీయ జెండా ఎగరేయాల్సిన డాక్టర్ డ్యూటీకి డుమ్మా కొట్టడంతో ఆ స్థానంలో కింది స్థాయి ఉద్యోగి జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేశారు. స్థానికులు గమనించి చెప్పడంతో వెంటనే జెండాను కిందకు దించి సరిచేసి మరోసారి ఎగురవేశారు.