- మరొకరికి తీవ్ర గాయాలు
సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి వద్ద రాజీవ్ రహదారిపై ఇసుక లారీ బైక్‌ను ఢీకొని తెలుకుంట్ల అనిష్క(16) అనే ఇంటర్తతతత స్టూడెంట్ చనిపోయింది. ఎస్సై శ్రావణ్ కుమార్ కథనం ప్రకారం.సుల్తానాబాద్ మండలం కాట్నపల్లికి చెందిన అనిష్క జూలపల్లి మండలం తేలుకుంటలోని కేజీబీవీలో ఇంటర్ చదువుతోంది. ఇటీవల ఫస్టియర్ఎగ్జామ్స్కంప్లీట్ కాగా హాలీడేస్ రావడంతో కరీంనగర్‌లోని బంధువుల ఇంటికి వెళ్లింది.
బుధవారం సాయంత్రం బంధువు భానుప్రకాశ్‌తో కలిసి బైక్‌పై కరీంనగర్ నుంచి కాట్నపల్లికి వస్తుండగా వెనుక నుంచి వచ్చిన ఇసుక లారీ ఢీకొట్టింది. దీంతో అనిష్క తీవ్రంగా గాయపడి స్పాట్‌లోనే చనిపోయింది. భాను ప్రకాశ్ తీవ్రంగా గాయపడ్డాడు. మృతురాలి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.