ప్రచారానికి డబ్బుల్లేవని పార్టీ టికెట్​ తిరిగిచ్చేసింది

ప్రచారానికి డబ్బుల్లేవని పార్టీ టికెట్​ తిరిగిచ్చేసింది
  • ఒడిశాలోని పూరి లోక్​సభ స్థానం నుంచి తప్పుకున్న సుచిత్ర మొహంతి

భువనేశ్వర్: లోక్​సభ ఎన్నికల్లోనే ఒడిశాలోని పూరి లోక్​సభ స్థానంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకున్నది. ఎన్నికల ప్రచారానికి తన వద్ద డబ్బుల్లేవని, పార్టీ నుంచి ఫండ్​ కూడా అందలేదని చెబుతూ కాంగ్రెస్ అభ్యర్థి సుచిత్ర మొహంతి ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. పార్టీ టికెట్​ తిరిగిచ్చేశారు. సుచిత్ర మొహంతి మాజీ ఎంపీ బ్రజమోహన్ మొహంతి కూతురు.. డబ్బుల్లేక తన ప్రచారం తీవ్రంగా దెబ్బతిన్నదని పేర్కొంటూ ఏఐసీసీ జనరల్​ సెక్రటరీ కేసీ వేణుగోపాల్​కు సుచిత్ర మెయిల్​ చేశారు.

తన సొంత నిధులతోనే ప్రచారం చేసుకోవాలని ఒడిశా కాంగ్రెస్​ ఇన్​చార్జి అజొయ్​కుమార్​ఒత్తిడి తెస్తున్నట్టు ఆరోపించారు. ‘నేను ప్రొఫెషనల్ జర్నలిస్టును. పదేండ్ల కిందట పాలిటిక్స్​లోకి వచ్చాను. పురీలో ప్రచారానికి నా దగ్గర ఉన్నదంతా ఇచ్చాను. ప్రజలనుంచి విరాళాలు స్వీకరించే ప్రయత్నం చేసినా పెద్దగా ఉపయోగంలేకుండా పోయింది. ప్రచార ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నించినా.. ఇబ్బందులు ఎదురవుతున్నాయి’ అని సుచిత్ర పేర్కొన్నారు.