RC16: రామ్ చరణ్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. RC16 నుంచి అదిరిపోయే అప్డేట్

RC16: రామ్ చరణ్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. RC16 నుంచి అదిరిపోయే అప్డేట్

మోస్ట్ అవైటెడ్ ఇండియన్ ఫిల్మ్స్ లో రామ్ చరణ్ RC16 ఒకటి. డైరెక్టర్ బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ మూవీ నుంచి అప్డేట్ రానుంది. నేడు మార్చి 26న సాయంత్రం 4.05నిమిషాలకు బిగ్ అనౌన్స్ ఉండనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

రేపు మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే ఉండటంతో మెగా ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వనుంది RC16 బృందం. అయితే,  RC16 లో హీరో రామ్ చరణ్ పాత్ర ఎలా వుండబోతోందని తెలియచెప్పే గ్లింప్స్ రిలీజ్ కానుందని తెలుస్తోంది. మరెలాంటి అప్డేట్ ఇవ్వనున్నారో అని ఆసక్తి నెలకొంది. 

స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో రూరల్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాకు పెద్ది (Peddi) అనే టైటిల్ ను ఖరారు చేసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర సైడ్ పెద్ది అంటే పెద్ద అని అర్ధం. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో చాలామంది ముసలివారిని,పెద్దవారిని 'మా పెద్ది' అని మర్యాదపూర్వకంగా పిలుస్తూ ఉంటారు. పెద్ది అనే టైటిల్..బుచ్చిబాబు కథకి తగ్గట్టుగా సెట్ చేసినట్లు వినిపిస్తోంది. మరి చరణ్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ అండ్ గ్లింప్స్ సైతం రానుందా? అనే తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించనుంది. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో రూరల్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తుండగా..రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు.

ALSO READ : Jr NTR: జపాన్లో భార్య ప్రణతి బర్త్డే సెలబ్రేషన్స్.. హృదయాలను కదిలిస్తున్న తారక్ పోస్ట్