మేయర్ విజయలక్ష్మి ఇంట్లోకి చొరబడిన అగంతకుడు

మేయర్ విజయలక్ష్మి ఇంట్లోకి చొరబడిన అగంతకుడు

జీహెచ్ఎంసీ మేయర్  గద్వాల విజయలక్ష్మి ఇంట్లోకి లక్ష్మణ్  అనే  రౌడీ షీటర్ చొరబడ్డాడు. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. మేయర్ ఇంట్లోకి మంగళవారం రౌడీ షీటర్ లక్ష్మణ్ నేరుగా వచ్చి ఆమె వ్యక్తిగత గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆమె సిబ్బంది అడ్డుకున్నారు.  తాను ముంబై నుంచి వచ్చానని, తనకు నేర చరిత్ర ఉందని, మేయర్ తో మాట్లాడాలంటూ బెదిరించాడు. ఆమె ఇంట్లో లేకపోవడంతో వెళ్లిపోయాడు. వంట మనిషి బాలాజీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న  బంజారాహిల్స్  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఇటీవల మేయర్  విజయలక్ష్మితో పాటుగా ఆమె తండ్రి కేశవరావు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే.