హిజాబ్​ లేకుండా పబ్లిక్​లో పాట.. ఇరాన్​ మహిళ అరెస్ట్​

హిజాబ్​ లేకుండా పబ్లిక్​లో పాట.. ఇరాన్​ మహిళ అరెస్ట్​

టెహ్రాన్​: పబ్లిక్​లో హిజాబ్ ధరించకుండా పాట పాడినందుకు ఇరాన్​మహిళను అక్కడి పోలీసులు అరెస్ట్​ చేశారు. జరా ఎస్మాయిలీ అనే మహిళ ఆ దేశ రాజధాని టెహ్రాన్​ వీధుల్లో ప్రదర్శనలు ఇస్తుంటుంది. కాగా, మెట్రో రైలు, పార్క్‌‌తో సహా బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్ ధరించకుండా ఆమె పాట పాడిన ఓ వీడియో ఇటీవల ఇంటర్నెట్‌‌లో వైరల్‌‌గా మారింది. దీంతో అమెను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

కాగా, అరెస్ట్​ తర్వాత ఆమె ఆచూకీ ఇంతవరకూ తమకు తెలియలేదని  కుటుంబ సభ్యలు తెలిపారు.  ముస్లిం ప్రజలపై అణచివేత చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు ఆమెను అరెస్టు చేసినట్టు ఇరాన్ అధికారులు చెబుతున్నారు. జరా అరెస్టును ఇరానియన్​ సింగర్, రైటు టు సింగ్​ క్యాంపెయిన్​ ఫైండర్​ ఫరావాజ్​ ఫర్వార్డిన్​ఖండించారు.