అల్వాల్లో మెడికో ఆత్మహత్య..

హైదరాబాద్: సికింద్రాబాద్ పరిధిలోని అల్వాల్లో ఎంబీబీఎస్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఆగస్టు 23, 2024న అల్వాల్ పరిధిలోని వెంకటాపురం సాయినగర్ అపార్ట్ మెంట్ లో నివాసముంటున్న గుండాల వరుణ్ రావు (23) ఫ్యాను ఉరివేసుకున్నారు. ఉజ్జెకిస్తాన్ లో ఎంబీ బీఎస్ చివరి సంవత్సరం చదువుతున్న వరుణ్ రావు..రెండు నెలల క్రితం సెలవులపై అల్వాల్ కు వచ్చాడు.

శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. వరుణ్ రావు ఆత్మహత్యకు గల కారణాలను అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నారు పోలీసులు.