న్యాయం చేయండి సార్లూ..! వృద్ధుడి ఆవేదన

‘అందరూ ఉన్నా ఒంటరినయ్యానంటూ’ ఓ వృద్ధుడు తహసీల్ ​ఆఫీస్​ వద్ద బుధవారం బైఠాయించాడు. మండలంలోని రాయపట్నంకు చెందిన ఈ వృద్ధుడి పేరు తుమ్మలపల్లి పుల్లయ్య. ఆయనకు ఇద్దరు కొడుకులు. ‘కొడుకులు పట్టించుకోక ఏడేళ్లుగా ఒంటరిగానే ఉంటున్న. నా భార్య కర్మకాండ చేసేందుకు కొడుకులు రాలే. 

కడుపులో గడ్డతో కడుపు నొప్పి వస్తుందని, దవాఖానాకు పోతే ఆపరేషన్ చేయాలంటున్నరు. పెద్ద కొడుకు, మనవడు, కోడలు కొట్టిన్రు. ఇంట్లో ఉండకుండా పెండ ఏస్తున్నరు. పోలీసోళ్లకు చెప్పినా, ఆర్​డీవోకు దరఖాస్తు పెట్టినా లాభం లేదు. సార్లు న్యాయం చేస్తరని ఇక్కడికచ్చిన’..అంటూ వాపోయాడు. 
- మధిర, వెలుగు