నవాడా/బీహార్: ఆసుపత్రిలో అంబులెన్స్ సౌకర్యం లేకపోవడంతో ఓ వృద్ధుడు మృతదేహాన్ని తన ఇంటి వరకు మోసుకెళ్లాడు. నడవడానికి ఒంట్లో బలం లేకున్నా... ఆయాసం వచ్చినప్పుడల్లా మధ్య మధ్యన ఆగుతూ... ఆ వృద్ధుడు అతి కష్టం మీద మృతదేహాన్ని తన ఒళ్లో పెట్టకుని ఇంటి వరకు మోసుకెళ్లాడు. ఈ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరూ అయ్యో పాపం అంటున్నారు. ఈ హృదయ విదారక ఘటన బీహార్ లోని నవాడా జిల్లాలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో మృతదేహాన్ని బాధిత ఇంటికి తీసుకెళ్లడానికి అంబులెన్స్ సౌకర్యం కల్పించని బీహార్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీహార్ లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు ఎంత అధ్వానంగా ఉన్నాయో చూడండి అంటూ కొంతమంది నెటిజన్లు అంటుంటే.. పేదోళ్లకు చావు కూడా దుర్భరమే అంటూ మరికొంత మంది కామెంట్ చేస్తున్నారు.
न स्ट्रेचर, न एम्बुलेंस, न शव वाहन
— Utkarsh Singh (@UtkarshSingh_) April 29, 2022
गोद में शव लेकर भागते इस बुजुर्ग को देखकर बिहार की हालत का अंदाज़ा लगाइए. ये नवादा के ज़िला अस्पताल की तस्वीर है. pic.twitter.com/VHUbbaYnlS
మరిన్ని వార్తల కోసం...