
బ్యాంక్ సిబ్బంది నిర్వాకం వల్ల ఓ వృద్ధుడు రాత్రంతా లాకర్ గదిలోనే ఉండాల్సి వచ్చింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆ వృద్ధుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ఈ ఘటన హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లోని యూనియన్ బ్యాంకులో జరిగింది. అసలేం జరిగిందంటే.? సోమవారం సాయంత్రం 4 గంటల 20 నిముషాలకు బ్యాంక్ లాకర్ కోసం బ్యాంక్ కు వెళ్లాడు కృష్ణారెడ్డి(85) అనే ఓ కస్టమర్. బ్యాంక్ సమయం ముగియడంతో గదిలోకి వెళ్లిన వృద్ధుడిని గమనించకుండా సిబ్బంది తాళం వేశారు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో వృద్ధుడి కుటుంబ సభ్యులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో మంగళవారం ఉదయం 10 గంటలకు పోలీసులు బ్యాంకు సీసీ కెమెరాలను పరిశీలించారు. బ్యాంక్ లాకర్ గదిలో కృష్ణుడు ఉన్నట్లు గుర్తించారు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు పోలీసులు.