వేములవాడ – సిరిసిల్ల హైవే పక్కన కదల్లేని స్థితిలో వృద్ధురాలు

వేములవాడ, వెలుగు: ఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధురాలిని గుర్తుతెలియని వ్యక్తులు సిరిసిల్ల జిల్లా వేములవాడలో వదిలేసి వెళ్లారు. మూడు రోజులుగా స్థానిక నంది కమాన్ సమీపంలోని వేములవాడ – సిరిసిల్ల హైవే పక్కన ఉన్న చెట్టు కింద కదల్లేని స్థితిలో బిక్కుబిక్కుమంటూ ఉంటోంది.

ఆమె ఎవరో, ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పలేకపోతుంది. సమీపంలోని ఇటుకల బట్టీ కార్మికులు ఆమెకు అన్నం పెడుతున్నారు. గురువారం కురిసిన వర్షానికి తడుస్తూ, వణికిపోతున్న వృద్ధురాలిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంరక్షణ కేంద్రానికి తరలిస్తామని పోలీసులు తెలిపారు.