![క్షుద్ర పూజలు చేస్తోందని వృద్ధురాలిపై దాడి](https://static.v6velugu.com/uploads/2023/06/An-old-woman-was-attacked-with-a-stick-for-performing-occult-worship_IFvbW8Ju7Y.jpg)
అశ్వారావుపేట, వెలుగు: క్షుద్ర పూజలు చేస్తోందంటూ ఓ వృద్ధురాలిపై కర్రతో దాడి చేసిన సంఘటన బుధవారం జరిగింది. ఎస్సై రాజేశ్‌కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని మద్దికొండ గ్రామానికి చెందిన కొరసా వెంకట నరసమ్మ కొంతకాలంగా ఇంట్లో పూజలు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలోని ఇంటి పక్కన ఉన్న ముడియం రంగారావు అనే వ్యక్తి నరసమ్మ క్షుద్రపూజలు చేస్తోందని కర్రతో దాడి చేశాడు. నరసమ్మ కుమారుడు బుచ్చిరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.