అవ్వా ఐడియా అదిరింది : కొడుకుపై కోపం.. ఎన్నికల నామినేషన్ వేసిన వృద్ధురాలు

కన్న కొడుకులు వృద్ధులైన తల్లిదండ్రులను అన్నం పెట్టకుండా ఇబ్బంది పెడితే  ఏంచేస్తారు.. ఊళ్లో నలుగురు పెద్ద మనుషులను పిలిచి పంచాయితీ పెట్టి బుద్ది చెప్పిస్తారు.. వినకపోతే కేసులు పెడతారు.. అయినా వినకపోతే కోర్టుకు వెళతారు.. ఈ అవ్వ మాత్రం వినూత్నంగా తన కొడుకుపై పోరాటానికి సిద్ధమైంది. కొడుకపై కోపంతో కరీంనగర్ జిల్లాలో ఓ వృద్ధురాలు తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. 

వృద్ధాప్యంలో ఆదరించి సేవల చేయాల్సిన కొడుకు తనపై కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నాడని కరీంనగర్ జిల్లా గంగాధర మండలం క్యూరిక్యాల కు చెందిన చీటి శ్యామల ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. తన బంధువులతో కలిసి వచ్చి జగిత్యాల నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసింది 82 యేళ్ల శ్యామల.

ALSO READ : గజ్వేల్ ప్రజలు పులిపిల్లలు.. డబ్బులకు అమ్ముడుపోరు: కిషన్ రెడ్డి

ఉన్న ఇల్లును స్వాధీనం చేసుకొని తన పెద్ద కొడు శ్రీరాంరావు కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతూ ఇబ్బంది పెడుతున్నాడని వాపోయింది. ముసలితనంలో ఆరోగ్యం బాగోలేక బాధపడుతున్న తనకు..తన కొడుకు ఆస్పత్రిలో కూడా  చూపించడం లేదని.. ఉండటానికి ఇల్లు కూడా లేదని..తనకున్యాయం జరగాలని నామినేషన్ వేస్తున్నానని శ్యామల తెలిపారు.