భద్రాచలం, వెలుగు : భద్రాచలం వద్ద గోదావరిలో దూకిన ఓ వృద్ధురాలిని పోలీసులు కాపాడారు. కొత్తగూడెంలోని రామవరం కాలనీకి చెందిన భారతి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోంది. తన పిల్లలను ఇబ్బంది పెట్టలేక చనిపోవాలని శుక్రవారం భద్రాచలంలోని గోదావరి స్నానఘట్టాల వద్దకు వచ్చింది. అనుమానం వచ్చిన కొందరు భక్తులు పోలీసులకు సమాచారమిచ్చారు.
దీంతో కానిస్టేబుల్స్ సురేంద్ర, జంపయ్య గోదావరి వద్దకు చేరుకునే సరికి ఆమె అప్పటికే నదిలోకి వెళ్లింది. వెంటనే వారు గోదావరిలోకి వెళ్లి ఆమెను బయటకు తీసుకువచ్చారు. తర్వాత పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడ కౌన్సిలింగ్ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.