జైనూర్, వెలుగు : జైనూర్లో ఆరు రోజులపాటు కొనసాగిన 144 సెక్షన్ను పోలీసులు ఎత్తివేశారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ కారణంగా ఈ నెల 13న జైనూర్లో 144 సెక్షన్ విధించిన పోలీసులు మార్కెట్ ను బంద్ చేయించారు. ఆదివారం 144 సెక్షన్ ఎత్తివేయడంతో మార్కెట్ తెరుచుకుంది.
కిరాణా దుకాణాలు, మెడికల్ షాప్ లు, హోటర్ తదితర వ్యాపారస్తులు షాప్ లను ఓపెన్ చేశారు. నిర్భయంగా వ్యాపారాలు చేసుకోవచ్చని ఆటో లో మైక్ ఏర్పాటు చేసి పోలీస్ డిపార్ట్మెంట్ అనౌన్స్ చేసింది. పరిస్థితిని ఎస్ఐ సందీప్ కుమార్ పరిశీలించారు.