గ్యాస్​సిలిండర్ ఆటో బోల్తా

గ్యాస్​సిలిండర్ ఆటో బోల్తా

హైదరాబాద్​ లంగర్​ హౌస్​లో పెను ప్రమాదం తప్పింది. టిప్పుఖాన్​ పూల్ వద్ద గ్యాస్​ సిలిండర్ల ఓవర్​ లోడ్​ తో వెళ్తున్న ట్రాలీ ఆటో బోల్తా పడింది. రోడ్డుపై సిలిండర్లు చెల్లాచెదురుగా పడిపోవడంతో అటుగా వెళ్లే ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అసలేం జరిగిందనే విషయం తెలుసుకునేలోపే గ్యాస్​ సిలిండర్లు రోడ్డుకు ఇరువైపులా చెల్లాచెదురుగా పడిపోయాయి. ఆటో డ్రైవర్​ కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. స్వల్ప గాయాలతో బతికి బయటపడ్డారు. 

గ్యాస్​ సిలిండర్లు రోడ్డుపై పడిపోవడంతో ట్రాఫిక్​ జామ్​ ఏర్పడింది. అక్కడే ఉన్న కొందరు స్థానికులు బోల్తాపడిన ఆటోను పైకి లేపి..డ్రైవర్​కు ప్రాథమిక చికిత్స అందించారు. ఓవర్​ స్పీడ్​ వల్లనే ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టిందని చెబుతున్నారు.