వైఎస్సార్ కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొని నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. కడప ఆజాద్ నగర్ కాలనీవాసులు ఆటోలో వెళ్తుండగా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి సమీపంలో ప్రమాదం జరిగింది. మృతులను మహమ్మద్(25), హసీనా(25), అమీనా(20), షాకీర్ (10)గా గుర్తించారు.
విషయం తెలియగానే పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.