- మొక్కు తీర్చుకున్న ఆదివాసీ మహిళ
ఆదిలాబాద్, వెలుగు: ఖాందేవ్ జాతరలో ఓ ఆదివాసీ మహిళ 2.5 కిలోల నువ్వుల నూనె తాగింది. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఖాందేవ్ జాతరలో మంగళవారం చింతగూడకు చెందిన ఆదివాసీ మహిళ యోత్మబాయి రెండున్న కిలోల నువ్వుల నూనె తాగి తన మొక్కులు తీర్చుకుంది. తొడసం వంశంలోని ప్రతి ఇంటి నుంచి పూజకు తీసుకువచ్చిన నువ్వుల నూనె సేకరిస్తారు. ఆ నూనెను తొడసం ఆడపడుచు తాగి మొక్కులు తీర్చుకోవడం ఆనాదిగా వస్తున్న ఆచారం.